Tamballapalle
Assembly Constituency Profile
తంబళ్ళపల్లె ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు
పెట్టింది పేరైన నియోజకవర్గం. ఆ శాసనసభా స్థానం 1955లో ఏర్పడింది. దాని పరిధిలో
ఆరు మండలాలు ఉన్నాయి. అవి తంబళ్ళపల్లె, ములకలచెరువు, పెద్దమండ్యం, కురబలకోట, బి
కొత్తకోట, పెద్దతిప్పసముద్రం.
తంబళ్ళపల్లె నియోజకవర్గంలో 1962లో స్వతంత్ర
పార్టీ గెలిచింది. 1955, 1967, 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు బావుటా
ఎగరేసింది. 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది. 1989లో
స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1999, 2004లో కాంగ్రెస్ గెలుపొందగా 2009, 2014లో
తెలుగుదేశం జోరు చూపింది.
2019లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధిగా పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి సమీప టీడీపీ ప్రత్యర్థి శంకర్ యాదవ్
మీద విజయం సాధించారు.
2024లో అధికార వైఎస్ఆర్‌సిపి తమ అభ్యర్ధిగా
సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డికి టికెట్ కేటాయించింది. ఎన్‌డిఎ కూటమిలోని
తెలుగుదేశం తరఫున డి జయచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇండీ కూటమి నుంచి
కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి బరిలో నిలిచారు.