Rayachoti Assembly Constituency Profile
రాయచోటి రెండేళ్ళ క్రితం ఏర్పడిన అన్నమయ్య జిల్లా
కేంద్రం. రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఆ అసెంబ్లీ స్థానం
పరిధిలో ఆరు మండలాలు ఉన్నాయి. అవి సాంబేపల్లి, చిన్నమండెం, రాయచోటి, గాలివీడు,
లక్కిరెడ్డిపల్లి, రామాపురం.
రాయచోటిలో 1952లో కిసాన్ మజ్దూర్ పార్టీ, 1962లో
స్వతంత్ర పార్టీ గెలిచాయి. 1955, 1967, 1972లో కాంగ్రెస్ విజయం సాధించింది.
సుగవాసి పాలకొండరాయుడు 1978లో జనతా పార్టీ నుంచి, 1983లో స్వతంత్ర అభ్యర్ధిగానూ
గెలుపొందారు. 1985, 1989, 1994 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే గెలుపు కైవసం
చేసుకుంది. సుగవాసి పాలకొండరాయుడు 1999, 2004లో తెలుగుదేశానికి రాయచోటి రాజకీయంలో
చోటు కల్పించారు.
2009 నుంచీ ఇప్పటివరకూ వరుసగా 15ఏళ్ళ నుంచీ
గడికోట శ్రీకాంత్‌రెడ్డి రాయచోటిలో గెలుస్తూ వస్తున్నారు. 2009లో కాంగ్రెస్
అభ్యర్ధిగా గెలిచాక 2012, 2014, 2019ల్లో ఆయన వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధిగా పోటీ చేసి
విజయాలు సాధించారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్‌సిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి మరోసారి పోటీలో
నిలబడ్డారు. ఆయనను ఎదుర్కోడానికి ఎన్‌డిఎ కూటమి నుంచి తెలుగుదేశం మండిపల్లి రాంప్రసాద్
రెడ్డిని రంగంలోకి దింపింది. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి షేక్ అల్లాబక్ష్
బరిలో ఉన్నారు.