Koduru Assembly Constituency Profile
రైల్వేకోడూరుగా సుపరిచితమైన అన్నమయ్య జిల్లాలోని
కోడూరులో శాసనసభా నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. ఈ అసెంబ్లీ స్థానం పరిధిలో ఐదు
మండలాలు ఉన్నాయి. అవి పెనగలూరు, చిట్వేల్, పుల్లంపేట, ఓబులవారిపల్లె, రైల్వే
కోడూరు. ఇది ఎస్సీలకు రిజర్వ్ అయిన నియోజకవర్గం.
కోడూరులో 1962, 1967 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ
గెలిచింది. 1972లో కాంగ్రెస్, 1978లో జనతా పార్టీ గెలిచాయి. ఇక వరుసగా 1983, 1985,
1989, 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం సైకిల్ జోరు చూపించింది. 2004, 2009లో
మాత్రం మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది. 2009లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచిన కొరముట్ల
శ్రీనివాసులు 2012లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధిగా విజయం దక్కించుకున్నారు. రాష్ట్ర
విభజన అనంతరం జరిగిన 2014, 2019 ఎన్నికల్లోనూ కొరముట్ల శ్రీనివాసులు వైసీపీ
అభ్యర్ధిగా హ్యాట్రిక్ సాధించారు.
2024 ఎన్నికల్లో అధికార
వైసీపీ తమ సిట్టింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులునే నిలిపింది. ఎన్‌డిఎ కూటమి
తరఫున జనసేన అభ్యర్ధి అరవ శ్రీధర్ పోటీ చేస్తున్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్
అభ్యర్ధిగా గోసాల దేవి ఎన్నికల బరిలో ఉన్నారు.