Rajampet Assembly Constituency Profile
అన్నమయ్య జిల్లాలోని రాజంపేట శాసనసభా నియోజకవర్గం
1951లో ఏర్పడింది. రాజంపేట అసెంబ్లీ స్థానం పరిధిలో ఆరు మండలాలు ఉన్నాయి. అవి…
సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, వీరబల్లె, టి సుండుపల్లి.
రాజంపేటలో 1952లో సిపిఐ, 1955లో కాంగ్రెస్,
1962లో స్వతంత్ర పార్టీ, 1967లో ఇండిపెండెంట్ అభ్యర్ధి, 1972లో మరోసారి స్వతంత్ర
పార్టీ గెలిచాయి. 1978, 1983, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 1985, 1994,
1999 ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది. 2004, 2009లో మళ్ళీ హస్తం పార్టీ జోరు
చూపింది. 2009లో గెలిచిన ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి 2012లో వైఎస్ఆర్సిపి నుంచి పోటీ
చేసి మళ్ళీ గెలిచారు. మేడా వెంకట మల్లికార్జునరెడ్డి 2014లో తెలుగుదేశం నుంచి, 2019లో
వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఇప్పుడు 2024లో వైఎస్ఆర్సిపి
మళ్ళీ మాజీ ఎమ్ముల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డిని బరిలోకి దింపింది. ఎన్‌డిఎ కూటమి
నుంచి టిడిపి అభ్యర్ధి సుగవాసి సుబ్రహ్మణ్యం పోటీ పడుతున్నారు. ఇండీ కూటమి నుంచి సిపిఐ
అభ్యర్ధి బుక్కే విశ్వనాథ నాయక్ నిలబడ్డారు.