ఇరాన్ అదుపులోని తీసుకున్న ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురిని విడిచిపెట్టారు. గత నెల రోజులుగా భారత దౌత్య అధికారులు జరుపుతున్న చర్చలు సఫలం కావడంతో గురువారంనాడు ఐదుగురిని విడుదల చేసినట్లు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
నౌకలోని సిబ్బందిని విడుదల చేయడంపై ఇరాన్ అధికారులకు ఇండియన్ కాన్సలేట్ అధికారులు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెస్సీ ఏరీస్ నౌకలో ఉన్న ఐదు మంది సిబ్బంది విడుదలయ్యారని, వారు భారత్‌కు బయలుదేరినట్లు ఎంబసీ అధికారులు వెల్లడించారు.
ఇజ్రాయెల్‌కు చెందిని సరకు రవాణా నౌకను ఏప్రిల్ 15న ఇరాన్ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇరాన్ తీరం సమీపంలోని హార్ముజ్ జలసంధి వద్ద ఎమ్మెస్సీ నౌకను ఇరాన్ అదుపులోకి తీసుకుంది. అందులోని భారత సిబ్బందిని విడుదల చేయించేందుకు దౌత్యాధికారులు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.
నౌకలో పనిచేస్తోన్న మొత్తం 18 మంది సిబ్బందిలో ఇప్పటికే కేరళకు చెందిన టెస్సా జోసెఫ్ ఏప్రిల్ 18న స్వదేశానికి చేరుకున్నారు. తాజాగా ఐదుగురిని విడుదల చేయడంతో మొత్తం ఆరుగురిని విడుదల చేసినట్లైంది. మిగిలిన 12 మంది సిబ్బందిని కూడా విడుదల చేయించేందుకు భారత దౌత్యాధికారులు చర్చలు కొనసాగిస్తున్నారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై కేసు నమోదు