మైదుకూరు
అసెంబ్లీ స్థానంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి, టీడీపీ నుంచి పుట్టా సుధాకర్
యాదవ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గుండ్లకుంట శ్రీరాములు పోటీకి దిగారు.
రఘురామిరెడ్డి
1985లో తొలిసారి టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
1999 లో రెండోసారి టీడీపీ తరఫున పోటీ చేసి
విజయం సాధించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత వైసీపీలో చేరారు. 2014, 2019లో వైసీపీ
నుంచి విజయం సాధించారు.
రఘురామిరెడ్డి 9వ సారి ఎన్నికల బరిలో నిలవగా, సుధాకర్
యాదవ్ మూడో సారి పోటీకి దిగారు. సుధాకర్ యాదవ్ 2014, 2019లో సైకిల్ గుర్తు పై పోటీ
చేసి ఓడారు.
మైదుకూరులో
రెడ్డి ఓటర్లు కీలకం కాగా, దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం, చాపాడు
మండలాలు ఉన్నాయి.
గత
ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలిపిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఈ దఫా
టీడీపీకి సహకరిస్తానని ప్రకటించారు. మైదుకూరు నుంచి డీఎల్ రవీంద్రనాథ్ రెడ్డి
ఆరుసార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు.
రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతికి తోడు బీజేపీ,
జనసేన మద్దతు, డీఎల్ సహకారంతో పుట్టా
సుధాకర్ యాదవ్ ఈ దఫా ఎన్నికల్లో గట్టుఎక్కుతారనే విశ్లేషణలు నియోజకవర్గంలో
జరుగుతున్నాయి. రెడ్డి ఓటు బ్యాంకు కు తోడు సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, వైసీపీ
ప్రభుత్వ పాలన ఫలితంగా రఘురామిరెడ్డే మళ్లీ గెలుస్తారనే లెక్కలు కూడా గట్టిగానే
వినపడుతున్నాయి.