ప్రొద్దుటూరు
శాసనసభ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హ్యట్రిక్ కోసం ప్రయత్నిస్తుండగా మాజీ
ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. అంగ, అర్థబలాల్లో ఇద్దరూ
ఇద్దరే . కాంగ్రెస్ నుంచి షేక్ పూల అహ్మద్ నజీర్ పోటీలో ఉన్నారు. రాచమల్లు పదేళ్ళ
నుంచి ఎమ్మెల్యేగా ఉండగా, వరదరాజుల రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి గతంలో నాలుగుసార్లు
విజయం సాధించారు. వీరిద్దరూ గతంలో కలిసి రాజకీయాలు చేసినవారే.
రాజకీయాల్లో
రాజశేఖర్ రెడ్డి సమకాలీకుడైన వరదరాజుల రెడ్డి, 1985లో తొలిసారి అసెంబ్లీలో
అడుగుపెట్టారు. 1983, 2009లోనే ఈ స్థానంలో టీడీపీ విజయం సాధించింది.
2004లో
కాంగ్రెస్ నుంచి నంద్యాల వరద రాజులు రెడ్డా కాంగ్రెస్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా
పోటీ చేసిన మల్లెల రంగారెడ్డిపై 17 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ ఎన్నికల్లో
బీజేపీ అభ్యర్థి కోవూరు బాలచంద్రారెడ్డి పోటీ చేయగా సుమారు 22 వేల ఓట్లు పడ్డాయి.
2009లో
సైకిల్ గుర్తుపై పోటీ చేసిన మల్లెల లింగారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన
వరదరాజుల రెడ్డిపై 16 వేల ఓట్ల మెజారిటీ సాధించారు.
2014లోనూ
వరదరాజుల రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రాచమల్లు ప్రసాద రెడ్డి
చేతిలో పరాజయం చెందారు. 2019లో టీడీపీ
టికెట్ దక్కించుకున్న మల్లెల లింగారెడ్డి కూడా రాచమల్లు చేతిలో ఓడారు.
టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసుతో వైసీపీ వ్యతిరేకత
ఎదుర్కుంటున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో బీసీల ఓట్లు 60వేల వరకు
ఉన్నాయి.
గత
ఐదేళ్ల నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి పని చేసిన ప్రవీణ్ కు బదులు పార్టీ
కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వరదరాజుల రెడ్డికి టికెట్ కేటాయించి టీడీపీ
అధిష్టానం అందరినీ షాక్ కు గురిచేసింది.