ఆంధ్రప్రదేశ్ శాసనసభకు బీజేపీ పోటీ చేస్తున్న
స్థానాల్లో జమ్మలమడుగు కూడా ఒకటి. కడప పార్లమెంటు స్థానంలోని జమ్మలమడుగు నుంచి
మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు.
2014లో వైసీపీ నుంచి
గెలిచి టీడీపీలో చేరి మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి 2019లో టీడీపీ తరఫున కడప
ఎంపీగా పోటీ చేసి ఓడారు.
2004, 2009 లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన ఆదినారాయణ రెడ్డి, 2014లో
వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.
2019లో మాత్రం ఆదినారాయణ రెడ్డి ఎంపీగా
పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి చేతిలో పరాజయం చెందారు. 2019లో టీడీపీ2019 అసెంబ్లీ
ఎన్నికల్లో వైసీపీ నుంచి మూలె సుధీర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పొన్నపురెడ్డి
రామసుబ్బారెడ్డిపై నెగ్గారు. 2019లో ఓటమి తర్వాత ఆదినారాయణ రెడ్డి టీడీపీని వీడి బీజేపీలో చేరారు.
2024 బ్యాలెట్ పోరులో వైసీపీ నుంచి సిట్టింగ్
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరోసారి పోటీలో దిగగా, కూటమి మద్దతుతో బీజేపీ నుంచి ఆదినారాయణ
రెడ్డి బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి పాముల బ్రహ్మానందరెడ్డి పోటీలో ఉన్నారు.