కమలాపురం
అసెంబ్లీ నియోజకవర్గంలో 1952 నుంచి 2019 వరకూ 15సార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు
కాంగ్రెస్, మూడు పర్యాయాలు టీడీపీ, రెండు మార్లు స్వతంత్ర అభ్యర్థులు
గెలిచారు.
సీపీఐ
ఓ సారి గెలవగా వైసీపీ రెండు సార్లు నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. రాయలసీమ ఉద్యమాన్ని నడిపిన ఎంవీ మైసూరారెడ్డి 1985లో కమలాపురం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
1989లో కూడా రెండో పర్యాయం ఆయన్నే కమలాపురం
ఓటర్లు గెలిపించారు.
ఈ
ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ
మధ్యనే పోటీ జరుగుతోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి పోటీలో ఉన్నారు.
ఆయన గత రెండు పర్యాయాలుగా టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ
నుంచి పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి బరిలో ఉన్నారు. సీపీఐ నుంచి గాలి చంద్ర పోటీలో
ఉన్నారు.
2019
ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై పోటీ చేసిన పుత్తా నరసింహారెడ్డిపై వైసీపీ అభ్యర్థి
రవీంద్రనాథ్ రెడ్డి సుమారు 27 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. 2014 లోనూ వీరిద్దరే
ప్రత్యర్థులగా తలపడినప్పటికీ రవీంద్రనాథ్ రెడ్డి కేవలం 5 వేల ఓట్ల మెజారిటీ
మాత్రమే సాధించగల్గారు.