పులివెందుల
నియోజకవర్గం నుంచి వైఎస్ కుటుంబ సభ్యులు శాసనసభకు ఎక్కువసార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు.
గడిచిన 46 ఏళ్ళగా పులివెందులలో వైఎస్ కుటుంబ సభ్యులే విజయం సాధించారు. దివంగత
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1978లో తొలిసారి పులివెందుల నుంచి విజయం
సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబ సభ్యులే వరుసగా 13
సార్లు పులివెందుల నుంచి గెలిచారు.
ముఖ్యమంత్రి జగన్ 2019లో టీడీపీ అభ్యర్థి సతీశ్
కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. ప్రస్తుతం సతీశ్ రెడ్డి వైసీపీలో చేరారు. 2014లో
కూడా జగన్ ఈ స్థానం నుంచే నెగ్గారు. ప్రస్తుతం జగన్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా
ఉన్నప్పటికీ గతం కంటే మెజారిటీ తగ్గుతుందనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం
టీడీపీ నుంచి బరిలో ఉన్న మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బిటెక్ రవి), 2017
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డిన ఓడించారు.
వైఎస్ షర్మిల కడప
ఎంపీ అభ్యర్థిగా నిలబడటంతో క్రాస్ ఓటింగ్
ఏ మేరకు జరుగుతుంది. అభ్యర్థుల విజయాకాశాలను ఏమేరకు ప్రభావం చూపుతుందో
తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.
రాజశేఖర్
రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందుల మోడల్ టౌన్ గా అభివృద్ధి చెందింది.
రాజశేఖర్
రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత వైఎస్ విజయమ్మ ఇక్కడి నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వైసీపీ ఆవిర్బావం తర్వాత ఆ పార్టీ నుంచి పోటీ చేసిన విజయమ్మ, వైఎస్
వివేకానందరెడ్డిపై పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వివేకానందారెడ్డి కాంగ్రెస్ ను
వీడి వైసీపీలో చేరారు.
జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి తో పులివెందులలో జగన్ మెజారిటీతో గతం కంటే
పెరుగుతుందని ఆ పార్టీ నేతలు
చెబుతున్నారు. వైఎస్ కుటుంబంలోని విభేదాలకు తోడు పొత్తుల లెక్కలతో విజయం కోసం
టీడీపీ పోరాడుతోంది.