ముస్లింలు
ఎక్కువగా ఉండే కడప అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం కోసం వైసీపీ, టీడీపీ హోరాహోరీగా
పోరాడుతున్నాయి. మైనారిటీలతో పాటు రెడ్డి సామాజికవర్గం ఓటర్లు కూడా వైసీపీకి అనుకూలంగా ఉండటం ఆపార్టీకి మేలు చేస్తోంది. ఈ
సారి ఈ స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన టీడీపీ, ఓసీ మహిళకు టికెట్ కేటాయించింది. ఇరు
పార్టీలు విజయం కోసం తీరిక లేకుండా చెమటోడుస్తున్నాయి.
కడప
అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడగా, కడప, కడప రూరల్ మండలాలు మాత్రమే
నియోజకవర్గంలో ఉన్నాయి.
కడప
మొదటి ఎమ్మెల్యేగా కోటిరెడ్డి గెలవగా, ఆ తర్వాత రెండు పర్యాయాలు రహమతుల్లా ఎన్నికయ్యారు.
ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఐదు పర్యాయాలు మినహా మిగిలిన ప్రతీ ఎన్నికల్లోను
మైనారిటీ అభ్యర్థే విజయం సాధించారు.
ఓ
మారు స్వతంత్ర అభ్యర్థి, మూడు సార్లు టీడీపీ, రెండు సార్లు వైసీపీ అభ్యర్థి మినహా
మిగిలిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు.
ఈ
నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతీ ముస్లిం అభ్యర్థి మంత్రిగా పనిచేసిన
చరిత్ర ఉంది. నాలుగు పర్యాయాలుగా టీడీపీ గెలవలేదు.
కడప
అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,74, 300 మంది ఓటర్లు ఉన్నారు. 72 వేల మంది
ముస్లిం ఓటర్లు. ఆ తర్వాత బలిజ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. వరుసగా
మైనారిటీ నేతలే ఎమ్మెల్యేలుగా ఉండడంతో బలిజ సామాజికవర్గంలోనే కొంత అసంతృప్తి, వ్యతిరేకత కనిపిస్తుంది. టీడీపీ ఈసారి
ప్రయోగాత్మకంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన మహిళను పోటీలో నిలిపింది. టీడీపీ పొలిట్ బ్యూరో
సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసుల రెడ్డి సతీమణి మాధవి రెడ్డి టీడీపీ నుంచి
పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి రెండుసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే గా గెలిచిన అంజాద్
బాషానే మరోసారి పోటీలోఉన్నారు. ఈసారి ఇక్కడ మైనారిటీ వర్సెస్ నాన్ మైనారిటీ అన్నట్లు
గా పోటీ జరుగుతోంది.
ప్రస్తుతం
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అంజాద్ బాషా ఉప ముఖ్యమంత్రిగా మైనారిటీ శాఖ మంత్రిగా బాధ్యతలు
నిర్వహిస్తున్నారు. 2014, 2019 లో రెండుసార్లు ఎమ్మెల్యేగా
గెలిచిన అంజాద్ బాషా, హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవ్వాలని ఆశ పడుతున్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కడప అభివృద్ధి
పనుల కోసం రెండు వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున
మట్టిని కొల్లగొట్టడంతోపాటు భూకబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టీడీపీ
నుంచి పోటీలో ఉన్న మాధవి రెడ్డి, ‘బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ’
కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. వైసీపీ లోని అసంతృప్తి నేతలను
కార్యకర్తలను ఎక్కడికి అక్కడ తమ వైపు తిప్పుకుంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉండడం
కూడా టిడిపి అభ్యర్థికి కలిసి వచ్చే అంశం.
మాధవి
రెడ్డికి సీటు ఇవ్వడంతో కడప టీడీపీ రెండుగా చీలిపోయింది. అప్పటివరకు ఇంచార్టీగా
ఉన్నఅమీర్ బాబుతో పాటు టికెట్టు ఆశిస్తూ వచ్చిన లక్ష్మీ రెడ్డి కుటుంబం కూడా
ప్రత్యేక వర్గంగా ఉన్నారు.