పోలింగ్
రోజున (మే 13న) తెలుగు రాష్ట్రాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ
తెలిపింది. తమిళనాడు, తూర్పు విదర్భ, మహారాష్ట్రలో ఏర్పడిన అల్పపీడనంతో
తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ
తెలిపింది. దాదాపు ఐదు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు
అంచనా వేశారు.
తెలంగాణలో
రానున్న 24 గంటల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా
వేసిందతి.
రంగారెడ్డి, ములుగు, పెద్దపల్లి,
భూపాలపల్లి జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందన్నారు. పలు చోట్ల వడగళ్ళ వాన కురిసే అవకాశం ఉందని
హెచ్చరించింది.