విజయవాడలో ఎన్డీయే రోడ్ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్
షో పై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్
లతో కలిసి విజయవాడల తాను పాల్గొన్న రోడ్
షో మరపురానిదని పేర్కొన్నారు.
ఏపీ
ఓటర్లు ఎన్డీయే అభ్యర్థులకు భారీగా ఓట్లు వేయనున్నారని, కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్
లో పర్యటిస్తున్న తనకు ఈ విషయం అర్థమైందన్నారు. మహిళలు, యువ ఓటర్ల మద్దతుతో ఎన్డీయే అభ్యర్థులకు
భారీ మెజారిటీ ఖాయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
లో వైసీపీ ప్రభుత్వానికి జూన్ 4వ తేదీ ఆఖరు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ
సంస్కృతితో వైసీపీకి బలమైన అనుబంధం ఉందని, అందుకే
ఆ పార్టీ రాష్ట్రంలో అవినీతి, కుటిలత్వం, మాఫియాను పోషించిందన్నారు.
బీజేపీ, టీడీపీ గతంలోనూ కలిసి పనిచేశాయని
గుర్తు చేసిన మోదీ, భవిష్యత్ అభివృద్ధి దిశగా తమది బలమైన
బంధమని పేర్కొన్నారు. క్రియాశీలకంగా ఉన్న జనసేన పార్టీ వల్ల తమ కూటమి మరింత
బలోపేతం అయిందని వివరించారు.
ఏపీలో
వ్యవసాయ ఉత్పాదకత మెరుగుపడాలని పారిశ్రామిక వృద్ధిని పెంచాలని, సేవల రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ లో తనదైన ముద్రను వేయాలని
కోరుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో
పోర్టుల ఆధారిత అభివృద్ధి జరిగేలా చూస్తామని వాగ్దానం చేసిన మోదీ, మత్స్య రంగానికి
గొప్ప ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.