ఉమ్మడి
అనంతపురం జిల్లాలోని పెనుకొండ అసెంబ్లీ
నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఉషశ్రీ చరణ్ పోటీ చేస్తున్నారు. బీసీ, కురుబ
సామాజికవర్గానికి చెందని ఉషశ్రీ చరణ్ గతంలో టీడీపీలో పనిచేశారు. 2014లో టీడీపీ ని
వీడి వైసీపీలో చేరారు. కళ్యాణదుర్గం నుంచి ఫ్యాన్ గుర్తు పై పోటీ చేసి
గెలిచారు. ప్రస్తుతం పెనుకొండ నుంచి తన
అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి పి. నరసింహప్ప బరిలో ఉన్నారు.
టీడీపీ
నుంచి సంజీవరెడ్డిగారి సరవిత బరిలోఉన్నారు. ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా సేవా
కార్యక్రమాలు చేస్తున్న సవిత, కురమ ఫైనాన్స్ కమిషన్ చైర్ పర్సన్ గా పనిచేశారు. ఆమె
కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉంది.
నియోజకవర్గంలో
బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. పరిగి, పెనుకొండ, గోరంట్ల, రొద్దం, సోమందేపల్లి మండలాలు
ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి.
వైసీపీ,
టీడీపీ అభ్యర్థులిద్దరూ
కురుబ సామాజికవర్గానికి చెందినవారే.
సిటింగ్ ఎమ్మెల్యే, మంత్రి ఎం.శంకరనారాయణకు బదులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉష శ్రీచరణ్‌ను ఇక్కడి నుంచి వైసీపీ పోటీలో
నిలిపింది. టీడీపీ అభ్యర్థి సవితమ్మ తండ్రి
ఎస్.రామచంద్రారెడ్డి 1983, 85లో
ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు.