హిందూపుర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మడకశిర(ఎస్.సీ) శాసనసభ నియోజకవర్గంలోని ఈ సారి టీడీపీ
నుంచి ఎం.ఎస్ రాజు, వైసీపీ నుంచి ఈర లక్కప్ప, కాంగ్రెస్ నుంచి కరికెర సుధాకర్ పోటీలో ఉన్నారు.
2019లో వైసీపీ అభ్యర్థి ఎం. తిప్పేస్వామి, టీడీపీ అభ్యర్థి కె. ఈరన్న పై సుమారు
13 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి చెందిన
ఎంఎస్ రాజును మడకశిరకు పంపారని వైసీపీ
నేతలు విమర్శిస్తున్నారు. రాజకు మడకశిర నియోజకవర్గ ప్రజలతో ఏమాత్రం సంబంధాలు లేవంటున్నారు.
తొలుత టీడీపీ అభ్యర్థిగా సునీల్ ను ప్రకటించారు.
ఆయన ప్రచారం లో పాల్గొనడంతో పాటు నామినేషన్ కూడా వేశారు. కానీ చివరి నిమిషంలో సునీల్
ను పక్కన పెట్టి ఎంఎస్ రాజుకు టీడీపీ బీఫాం అందజేసింది.
గుడిబండ మండలం ఫళారం
గ్రామానికి చెందిన ఈరలక్కప్పకు వైసీపీ
టికెట్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన గృహంలో తల్లితో కలిసి ఉంటున్న ఈర లక్కప్ప 2006–2011 మధ్య గుడిబండ సర్పంచ్‌గా
పని చేశారు.
2014 లో టీడీపీ అభ్యర్థి ఈరన్న, వైసీపీ నుంచి పోటీ చేసిన తిప్పేస్వామిపై సుమారు 14 వేలన్నర ఓట్లపై నెగ్గారు.
మాజీమంత్రి, పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి
గతంలో మడకశిర స్థానం జనరల్ గా ఉన్నప్పుడు మూడుసార్లు విజయం సాధించారు. నాలుగోసారి కళ్యాణదుర్గం
నుంచి నెగ్గారు.
ఇప్పటి వరకు 14 సార్లు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే
కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ 8 సార్లు, టీడీపీ
మూడుసార్లు, వైసీపీ ఒకసారి, స్వతంత్ర పార్టీ
ఒకసారి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఓసారి విజయం సాధించారు.