శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పేరు చెప్పగానే గుర్తొచ్చేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. నవనరసింహ ఆలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన
ఆలయం ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. ఖాద్రి నరసింహుడిగా, కాటమ రాయుడిగా కదిరిలో స్వామి పూజలు అందుకుంటున్నారు.
1952లో ఏర్పడిన ఈ కదిరి నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్
పార్టీకి కంచుకోటగా ఉండేది. ఆ పార్టీ అభ్యర్ధులు
7 సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టగా, తెలుగుదేశం పార్టీ మూడు సార్లు, వైసీపీ రెండు సార్లు, బీజేపీ ఒకసారి ఈ స్థానంలో విజయం
సాధించింది.
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్వేలు,
ఇతర సమాచారం ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యే
శిద్దారెడ్డికి టికెట్ నిరాకరించారు. ఆయనకు బదులుగా మైనార్టీ నేత మక్బూల్ భాషాను
ఫ్యాన్ గుర్తుపై బరిలో దించారు.
తెలుగుదేశం పార్టీ కందికుంట వెంకట
ప్రసాద్ కు టికెట్ కేటాయించింది. జగన్ పాలనపై వ్యతిరేకత, స్థానిక వైసీపీలో గ్రూపులు, టీడీపీ- జనసేన-
బీజేపీ కూటమి కారణంగా తన విజయం తధ్యమని
వెంకటప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 51వేల 562 మంది ఓటర్లు ఉండగా.. అందులో
లక్షా 23వేల 778 పురుషులు, లక్షా 27 వేల 776 మహిళా ఓటర్లు ఉన్నారు.