రాప్తాడు
రాజకీయాల్లో హోరాహోరీ పోరు జరుగుతోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, టీడీపీ నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత పోటీలో
ఉన్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రకాశ్ రెడ్డి పోరాడుతుండగా, చేజారిన
ఎమ్మెల్యే హోదాను ఎలాగైనా కైవసం చేసుకోవాలని పరిటాల కుటుంబం సర్వశక్తులూ ఒడ్డుతోంది.
ఇంజినీరింగ్
చదివిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడారు. 2014
లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడినప్పటికీ 2019లో అపజయమే ఎరుగని పరిటాల కుటుంబాన్ని
ఆయన ఓడించారు. పరిటాల సునీత గతంలో పెనుకొండ నుంచి కూడా ఓ మారు విజయం సాధించారు. పరిటాల రవి పెనుకొండ నుంచి నాలుగుసార్లు గెలిచారు.
పరిటాల రవి, ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. పరిటాల సునీత 2014లో చంద్రబాబు
ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
పరిటాల
కుటుంబం తొలి నుంచి టీడీపీ తోనే ఉంది. 2014, 2009 లో ఆమె విజయం సాధించారు.
నియోజకవర్గంలో రెడ్డి, బోయ, కురుబ ఓట్లు
అధికంగా ఉండగా, ఆత్మకూరు, కనగానపల్లి, సేకే పిల్లి, రామగిరి, రాప్తాడు మండలాలు నియోజకవర్గ
పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీ నుంచి తోపుదుర్తి ప్రకాశ్
రెడ్డి, టీడీపీ నుంచి పరిటాల సునీత, కాంగ్రెస్ నుంచి ఆది ఆంధ్ర శంకరయ్య పోటీలో
ఉన్నారు.