BSP Mayawati
ousts nephew as her political successor
బహుజన సమాజ్ పార్టీ
అధ్యక్షురాలు మాయావతి తన రాజకీయ వారసత్వం నుంచి మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తప్పించింది.
పార్టీ జాతీయ సమన్వయకర్త విధుల నుంచి కూడా తొలగించింది. రాజకీయంగా పూర్తి పరిపక్వత
వచ్చేవరకూ అతన్ని బాధ్యతల నుంచి తప్పించింది. ఆ విషయాన్ని మాయావతి తన ఎక్స్
హ్యాండిల్లో ట్వీట్ చేసింది.
ఉత్తరప్రదేశ్ మాజీ
ముఖ్యమంత్రి అయిన మాయావతి ఎక్స్ వేదికలో ఇలా ట్వీట్ చేసింది, ‘‘బహుజన సమాజ్ పార్టీ
జాతీయ సమన్వయకర్తగానూ, నా రాజకీయ వారసుడిగానూ ప్రకటించాను. అయితే పార్టీ
దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా అతనికి పూర్తి పరిపక్వత వచ్చేవరకూ ఆ రెండు కీలక
బాధ్యతల నుంచీ దూరంగా ఉంచుతున్నాను’’ అని ప్రకటించింది.
‘‘బీఎస్పీ కేవలం ఒక
పార్టీ మాత్రమే కాదు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవచించిన ఆత్మగౌరవం, కాన్షీరామ్‌జీ,
నేను మా జీవితాలను అంకితం చేసిన సామాజిక మార్పుల కోసం పోరాడే ఉద్యమం కూడా. ఆ
ఉద్యమం ఊపును కొనసాగించడానికి ఇప్పుడు కొత్తతరం సిద్ధమవుతోంది’’ అని కూడా మాయావతి
ట్వీట్ చేసింది.
ఆకాష్ ఆనంద్‌ను మాయావతి
తన రాజకీయ వారసుడిగా 2023 డిసెంబర్లో ప్రకటించింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల వేళ
ఏప్రిల్ 28న ప్రచార ర్యాలీలో ఆకాష్ ఆనంద్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆ
వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఆకాష్ ఆనంద్, మరో నలుగురి మీద నైతిక ప్రవర్తనా నియమావళి
ఉల్లంఘన కేసు నమోదయింది. ఆ నేపథ్యంలో ఆకాష్‌కు ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదంటూ
అతన్ని మాయావతి పక్కన పెట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.