Putin Swears In as President of Russia for Fifth Consecutive Time
ఇటీవల జరిగిన రష్యా
అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ భారీ విజయం సాధించారు, వరుసగా ఐదోసారి అధ్యక్షపీఠం
ఎక్కారు. మంగళవారం నాడు క్రెమ్లిన్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణస్వీకారం
చేసారు.
తాజాగా ఐదోసారి అధ్యక్ష బాధ్యతలు
స్వీకరించిన పుతిన్, ఆ పదవిలో వచ్చే ఆరేళ్ళపాటు ఉంటారు. అంటే 2030 వరకూ రష్యా
అధికార పీఠం ఆయన సొంతం. ఇప్పటికి 24 సంవత్సరాలు పరిపాలించిన పుతిన్, ఈ టెర్మ్ పూర్తి
చేస్తే 30ఏళ్ళు గద్దెమీద ఉన్న పరిపాలకుడవుతారు. అప్పుడు రష్యా చరిత్రలోనే అత్యధిక
కాలం అధ్యక్ష పదవిలో ఉన్న స్టాలిన్ రికార్డును పుతిన్ బద్దలుగొడతారు.
పుతిన్ మొట్టమొదటిసారి
1999లో తాత్కాలిక అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. బోరిస్ ఎల్సిన్
రాజీనామాతో పుతిన్ గద్దెనెక్కారు. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం
సాధించారు. అప్పటినుంచీ ఆయనే రష్యా అధినేతగా ఉన్నారు. ప్రస్తుత రష్యా రాజ్యాంగం
ప్రకారం పుతిన్ 2030లో మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు.