తాడిపత్రిలో ఎప్పిటిలాగానే ఈ దఫా కూడా ఎన్నికల రణం ఉత్కంఠ రేపుతోంది. జేసీ కుటుంబం, కేతిరెడ్డి కుటుంబం మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి బరిలో ఉండగా టీడీపీ తరఫున గత ఎన్నికల్లో ఓడిన జేసీ అస్మిత్ రెడ్డి పోటీలో ఉన్నారు.
జేసీ కుటుంబానికి ఈ నియోజకవర్గంలో పట్టుఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపర్తి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. ఓ మారు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. జేసీ దివాకర్ రెడ్డి ఓ మారు ఎంపీగా పలు దఫాలు శాసనసభకు ఎన్నికయ్యారు. ఇక్కడ పట్టు ఉంది.
1985 నుంచి వరుసగా ఆరు సార్లు దివాకరరెడ్డి, ఒక మారు ప్రభాకరరెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాత్రం ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపొందారు.
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్‌రెడ్డికి టీడీపీ మరో అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో ఓడినప్పటికీ నియోజకవర్గం ప్రజలతో మమేకం అయ్యారు.
1985 నుంచి జేసీ కుటుంబమే తాడిపత్రిలో గెలుస్తోంది. కాకపోతే 1985 నుంచి 2009 వరకు జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో జేసీ కుటుంబం టీడీపీలో చేరింది. ఆ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, సైకిల్ గుర్తుపై పోటీ చేసి శాసనసభలోఅడుగుపెట్టారు. వైసీపీ అభ్యర్థి రామిరెడ్డిపై సుమారు 22 వేల ఓట్ల మెజారిటీ సాధించారు.
నియోజకవర్గంలో టీడీపీ రెండుమార్లే విజయం సాధించింది.
వైసీపీ ప్రభంజనంలోనూ తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. ఒకసారి ఓడిపోవడంతో అస్మిత్‌రెడ్డిపై ఓటర్లలో సానుభూతి వ్యక్తమవుతోంది.
పెద్దారెడ్డి పట్ల కూడా ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. కేడర్ కు నిత్యం అందుబాటులో ఉంటారని ఏదైనా పని పై వెళితే తక్షణ పరిష్కారానికి ప్రయత్నిస్తారని లోకల్ టాక్.