Uravakonda Assembly constituency2024
అనంతపురం లోక్సభ పరిధిలోని ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఏడోసారి
పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తలపడుతున్నారు.
పయ్యావుల నాలుగుసార్లు విజయం సాధించగా,
రెండుమార్లు ఓడారు. వైసీపీ అభ్యర్థి తమ్ముడు మధుసూదనరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ
చేస్తున్నారు. దాంతో కాంగ్రెస్కు పడే ఓట్లతో వైసీపీ నష్టపోయే అవకాశముంది. అన్నను
ఓడించడమే లక్ష్యంగా మధుసూదనరెడ్డి ప్రచారం చేస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చ
జరుగుతోంది. ఉరవకొండలో మొత్తం 8 మంది స్వతంత్రులు బరిలో
ఉన్నారు.
2004 నుంచి ఇక్కడ మెజారిటీ ఎప్పుడూ తొమ్మిది వేలు
దాటిన దాఖలాలు లేవు. 2004లో 8,255, 2009లో 229, 2019లో 2,132 ఓట్ల ఆధిక్యంతో కేశవ్ గెలవగా, 2014లో 2,275 ఓట్ల మెజారిటీతో విశ్వేశ్వరరెడ్డి విజయం సాధించారు.
ఉరవకొండలో గెలిచే పార్టీ అధికారంలోకి
రాదు అనే మూఢనమ్మకం కూడా ఉంది. మరి 2024 ఉరవకొండ తీర్పు ఈ సెంటిమెంటును తప్పు అని తేలుస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే
జూన్ 4 వరకు ఆగాల్సిందే.