కర్ణాటక సరిహద్దు నియోజకవర్గాల్లో
ఒకటైన రాయదుర్గం రాజకీయం రంజుగా మారింది. ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు సీనియర్
నేతలు పోటీలో ఉన్నారు. టీడీపీ తరఫున కాలవ శ్రీనివాసులు పోటీ చేస్తుండగా, వైసీపీ
నుంచి మెట్టు గోవిందరెడ్డికి టికెట్ దక్కింది. ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలే కావడం
విశేషం.
కన్నడ సరిహద్దు ప్రాంతం కావడంతో ఆ
రాష్ట్ర రాజకీయనేతల జోక్యం కూడా నియోజకవర్గంలో ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. మైనింగ్
ఏరియా కావడంతో నేతలకు ఫండింగ్ కూడా అక్కడి నుంచే జరుగుతుందనే ఆరోపణలున్నాయి.
సిటింగ్ ఎమ్మెల్యే కాపు
రామచంద్రారెడ్డిని వైసీపీ పక్కనబెట్టడంతో ఆయన బీజేపీలో చేరారు. ప్రస్తుతం గత
ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన కాలవ శ్రీనివాసులును గెలిపించాలని నియోజకవర్గంలో
ప్రచారం చేస్తున్నారు.
కాలవ శ్రీనివాసులు 2014లో ఇక్కడి నుంచి గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. 2019 ఎన్నికల్లో కాపు
రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు.
పరాజయం చెందినప్పటికీ ఐదేళ్లుగా నియోజకవర్గంలో
కేడర్ కు నిత్యం అందుబాటులో ఉన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు అయనకు కలిసే వచ్చే అంశం.
నియోజకవర్గంలో అందరికీ సుపరిచితుడైన
గోవింద రెడ్డి, పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఉచితంగా వివాహాలు చేయించడంతో పాటు
పలు స్కూళ్ళ అభివృద్ధికి నిధులు అందజేశారు. 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా,
2011 నుంచి 2017 వరకు ఎమ్మెల్సీ గా పనిచేశారు. ఏపీఐఐసీ చైర్మన్ గా కూడా పనిచేసిన
అనుభవం ఆయనకు ఉంది.
2004
లో టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డిపై విజయం
సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో
కాంగ్రెస్ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి చేతిలో ఓడారు.