అనంతపురం లోక్సభ
నియోజకవర్గంలో మొత్తం ఏడు శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, శింగనమల(ఎస్సీ), అనంతపురం పట్టణం, కళ్యాణదుర్గం అసెంబ్లీ
స్థానాలు ఈ లోక్ సభ స్థానం పరిధిలోకి వస్తాయి
తాజా గణాంకాల ప్రకారం..
నియోజకవర్గంలో 17,47,912 మంది ఓటర్ల ఉండగా, 8,65,742 మంది పురుషులు, 8,81,938 మహిళలు.. 232 ట్రాన్స్జెండర్
ఉన్నారు.
ప్రస్తుతం టీడీపీ నుంచి
అంబికా లక్ష్మీనారాయణ, వైసీపీ నుంచి మాలగుండ్ల
శంకరనారాయణ పోటీలో ఉన్నారు. వజ్జల
మల్లికార్జున్ను కాంగ్రెస్ పార్టీ బరిలో దించింది.
ఈ నియోజకవర్గంలో టీడీపీ మూడు సార్లు మాత్రమే విజయం
సాధించింది. 2014లో జేసీ దివాకర్ రెడ్డి, 1999లో కాలువ శ్రీనివాసులు, 1984 లో డి.
నారాయణ స్వామి మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు.
ఓ సారి సీపీఐ అభ్యర్థి తరిమెల
నాగిరెడ్డి గెలవగా మిగతా అన్నిసార్లు కాంగ్రెస్ గెలిచింది.అనంత వెంకటరామిరెడ్డి
హస్తం గుర్తుపై నాలుగు దఫాలు నెగ్గారు. 2019
ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జేసీ పవన్రెడ్డిపై
వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య విజయం సాధించారు.
నియోజకవర్గంలో మొత్తం 21 మంది నామినేషన్ వేయగా అందులో 18 మంది స్వతంత్రులు ఉన్నారు. ప్రధానపార్టీల అభ్యర్థులు మినహా మిగతా ఎవరూ చెప్పుకోదగిన స్థాయిలో
ప్రభావం చూపే పరిస్థితి లేదు.
వామపక్షాలకు సానుభూతిపరులు, అభిమానులు,
మద్దతుదారుల ఓట్లు నియోజకవర్గంలో ముప్పై నుంచి 40 వేలు ఉంటాయి. ఈ ఓట్లు కాంగ్రెస్
అభ్యర్థికి పడే అవకాశం ఉంది. అలాగే 40వేల ముస్లిం ఓటర్లు మద్దతు కూడా హస్తం పార్టీకి
ఉంటుందని స్థానికంగా చర్చ జరుగుతోంది. అనంతపురం అర్బన్ లో ముస్లింలకు సంబంధించి 40,000
ఓట్లు ఉన్నాయి.
కరువు పీడిత ప్రాంతాల్లో
ఒకటైన అనంతపురం లోక్ సభ నియోజకవర్గంలో రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. 900 అడుగులు తవ్వితేనే బోరుబావుల్లో
నీరు దొరుకుతోంది. తమ
సమస్యలకు సరైన పరిష్కారం చూపగల్గే వారికే
ఓటు వేస్తామని చెబుతున్నారు. ప్రకృతి ప్రకోపానికి గురవుతున్న తమను ఆదుకునేలా
రాజకీయ పార్టీలు చేపట్టాలని కోరుతున్నారు.