నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. బేతంచర్ల, డోన్, పీ.పల్లి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. 219678 మంది ఓటర్లు ఉన్నారు. వ్యవసాయంపైనే ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు.ఈ నియోజకవర్గం నుంచి ఉద్దండులు గెలిచినా సాగు,తాగునీటి సమస్యలు మాత్రం పరిష్కరించలేకపోయారు.
1952లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కొట్రికె వెంకటశెట్టి, 1955లో స్వతంత్ర అభ్యర్థి బి.పి.శేషారెడ్డి, 1962లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డి, 1967లో స్వతంత్ర పార్టీ నుంచి కేబీకే. మూర్తి విజయం సాధించారు.
1972లో కాంగ్రెస్ నుంచి శేషన్న, 1978,1983లో కాంగ్రెస్ నుంచి కేఈ కృష్ణమూర్తి, 1985లో టీడీపీ నుంచి కేఈ మూడోసారి గెలిచారు. 1989లో టీడీపీ నుంచి కేఈ, 1994లో కాంగ్రెస్ అభ్యర్థి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, 1999లో కేఈ ప్రభాకర్ టీడీపీ నుంచి గెలుపొందారు.
2004లో కాంగ్రెస్ నుంచి కోట్ల సుజాతమ్మ, 2009లో టీడీపీ నుంచి కేఈ కృష్ణమూర్తి, 2014లో వైసీపీ నుంచి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి, 2019లో మరోసారి బుగ్గన గెలిచి, ఆర్థిక మంత్రిగా సేవలందిస్తున్నారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బుగ్గన, టీడీపీ నుంచి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి గర్లపాటి మాధులేటి స్వామి బరిలో నిలిచారు.