నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. నంద్యాల అర్భన్, నంద్యాల రూరల్, గోస్పాడు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో 256573 మంది ఓటర్లు ఉన్నారు.
1952లో జరిగిన తొలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి మల్లు సుబ్బారెడ్డి, 1955లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ గోపవరం రామిరెడ్డి విజయం సాధించారు. 1959 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవీ రెడ్డి, 1962లో స్వతంత్ర అభ్యర్థి మల్లు సుబ్బారెడ్డి విజయం సాధించారు. 1967లో కాంగ్రెస్ నుంచి ఎస్.బి.ఎస్.సాహెబ్, 1972లో స్వతంత్ర అభ్యర్థి బొజ్జా వెంకట రెడ్డి, 1978లో జనతాపార్టీ నుంచి బొజ్జా వెంకట రెడ్డి గెలుపొందారు.
1983లో టీడీపీ నుంచి ఎం.సంజీవరెడ్డి, 1985లో టీడీపీ నుంచి ఎన్.ఎం.డి. ఫరూక్, 1989లో కాంగ్రెస్ నుంచి వి.రామనాథ్ రెడ్డి, 1994, 1999లో టీడీపీ నుంచి ఎన్.ఎం.డి. ఫరూక్ విజయం సాధించారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి శిల్పా మోహన్ రెడ్డి వరుసగా రెండుసార్లు గెలిచారు. 2014లో వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి, 2017 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, 2019లో వైసీపీ నుంచి శిల్పా రవి చంద్రా కిషోర్ రెడ్డి గెలుపొందారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి సింగరెడ్డి రవిచంద్రా కిషోర్ రెడ్డి, టీడీపీ నుంచి నష్యం మహ్మద్ ఫరూక్, కాంగ్రెస్ నుంచి గోపవరం గోకుల్ కిష్ణారెడ్డి బరిలో నిలిచారు.