నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం 1967లో ఏర్పాటైంది. కల్లూరు, ఓర్వకల్, పాణ్యం, గడివేముల మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. పాణ్యంలో 288031 ఓట్లు ఉన్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు పాణ్యం నియోజకవర్గం పెట్టింది పేరు.
1967లో పాణ్యం నియోజకవర్గం ఏర్పాటు అయ్యాక మొదటిసారి స్వతంత్ర అభ్యర్థి వి.రెడ్డి,1972లో కాంగ్రెస్ నుంచి ఏరాసు అయ్యపు రెడ్డి, 1978లో జనతా పార్టీ నుంచి ఏరాసు అయ్యపు రెడ్డి, 1985, 1989, 1994లో కాంగ్రెస్ నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
1999లో టీడీపీ నుంచి బిజ్జం పార్థసారధిరెడ్డి, 2004, 2009లో కాంగ్రెస్ నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి, 2014లో వైసీపీ నుంచి గౌరు చరితా రెడ్డి, 2019లో వైసీపీ నుంచి కాటసాని ఆరోసారి గెలిపారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, టీడీపీ నుంచి గౌరు చరితా రెడ్డి, సీపీఐ నుంచి డి.గౌస్ దేశాయ్ బరిలో నిలిచారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు