నందికొట్కూరు నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. నందికొట్కూరు, పగిడ్యాల, జూపూడి బంగ్లా, కొత్తపల్లి, పాములపాడు, మిద్దూర్ మండలాలు ఈ నియోజకవర్గ
పరిధిలోకి వస్తాయి. నందికొట్కూరులో 197451 మంది ఓటర్లు ఉన్నారు.
1952లో తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ నుంచి సి.పుల్లారెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎన్.కె.లింగం, 1962లో స్వతంత్ర అభ్యర్థి పుల్యాల వెంకట కృష్ణారెడ్డి, 1967లో కాంగ్రెస్ నుంచి సి.ఆర్.రెడ్డి, 1972లో కాంగ్రెస్ నేత మద్రు సుబ్బారెడ్డి, 1978లో కాంగ్రెస్ అభ్యర్థి బైరెడ్డి శేష శయనా రెడ్డి, 1983లో స్వతంత్ర అభ్యర్థి బైరెడ్డి శేష శయనా రెడ్డి విజయం సాధించారు.
1985లో టీడీపీ నుంచి ఇప్పల తిమ్మారెడ్డి, 1989లో కాంగ్రెస్ అభ్యర్థి బైరెడ్డి శేష శయనారెడ్డి, 1994, 1999లో టీడీపీ నుంచి బైరెడ్డి రాజశేఖరరెడ్డి, 2004లో కాంగ్రెస్ అభ్యర్థి
గౌరు చరితా రెడ్డి, 2009లో కాంగ్రెస్ నుంచి లబ్బి వెంకట స్వామి విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి ఇషాల యక్కలాదేవి, 2019లో వైసీపీ అభ్యర్థి తోగురు ఆర్థర్ గెలుపొందారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి డాక్టర్ సుధీర్ దారా, టీడీపీ అభ్యర్థి గిట్టా జయసూర్య, కాంగ్రెస్ నుంచి ఆర్థర్ తొగురు పోటీ పడుతున్నారు.