నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది.గతంలో ఈ ప్రాంతం ఆత్మకూరు నియోజకవర్గంలో ఉండేది. శ్రీశైలం, ఆత్మకూరు, వెలిగోడు,
బండి ఆత్మకూరు, మహానంది మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఈ నియోజకవర్గంలో 184794 మంది ఓటర్లు ఉన్నారు.
శ్రీశైలం నియోజకవర్గం ఏర్పడిన తరవాత తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఏరాసు ప్రతాప్ రెడ్డి విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి
బుడ్డా రాజశేఖర్ రెడ్డి, 2019లో వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఏరాసు ప్రతాప్ రెడ్డి, సమీప టీడీపీ అభ్యర్థిపై 4307 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుడ్డా రాజ శేఖర్ రెడ్డి, సమీప టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డిపై 4861 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి, సమీప టీడీపీ అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై 38698 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, టీడీపీ నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అసర్ సయ్యద్ ఇస్మాయిల్ బరిలో నిలిచారు.