నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. ఆళ్లగడ్డ, సిర్వెల్, దోర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో 220642 మంది ఓటర్లు ఉన్నారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గం ఏర్పడిన తరవాత 1962లో జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సిత్రి జయరాజు, 1967లో స్వతంత్ర అభ్యర్థి గంగుల తిమ్మారెడ్డి, 1972లో స్వతంత్ర అభ్యర్థి సోముల వెంకట సుబ్బారెడ్డి, 1978లో స్వతంత్ర అభ్యర్థి గంగుల తిమ్మారెడ్డి గెలుపొందారు.
1980లో కాంగ్రెస్ నుంచి గంగుల ప్రతాప్ రెడ్డి, 1983లో స్వతంత్ర అభ్యర్థి సోముల వెంకట సుబ్బారెడ్డి, 1985లో కాంగ్రెస్ నుంచి గంగుల ప్రతాపరెడ్డి, 1989లో టీడీపీ నుంచి భూమా శేఖర్ రెడ్డి, 1994లో టీడీపీ నుంచి భూమా నాగిరెడ్డి విజయం సాధించారు.
1996లో టీడీపీ నుంచి భూమా నాగిరెడ్డి, 1999లో టీడీపీ అభ్యర్థి శోభానాగిరెడ్డి, 2004లో కాంగ్రెస్ నుంచి గంగుల ప్రతాప్ రెడ్డి, 2009లో ప్రజారాజ్యం నుంచి శోభానాగిరెడ్డి, 2012,2014లో వైసీపీ నుంచి శోభా నాగిరెడ్డి,2014 ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి భూమా అఖిలప్రియ, 2019లో వైసీపీ నుంచి గంగుల బ్రిజేంద్ర రెడ్డి గెలుపొందారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి గంగుల బ్రిజేంద్ర రెడ్డి, టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ, కాంగ్రెస్ నుంచి బరగొడ్ల హుసేన్ బరిలో నిలిచారు.