జమ్మూ
కశ్మీర్ లోని కుల్గామ్ ప్రాంత
పరిధిలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు
కోల్పోయినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. కుల్గామ్‌లోని రెడ్వానీ ప్రాంతంలో
ఉగ్రవాదులు నక్కినట్లు సమాచారం అందగా భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
దీంతో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.
ప్రతిగా భద్రతా బలగాలు కాల్పులు
జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ప్రస్తుతం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
మే
4న జరిగిన పూంచ్ దాడి నేపథ్యంలో సూరంకోట్ నుంచి జర్రాన్ వాలీ వరకు గల ప్రాంతాన్ని
భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. భారీగా మోహరించిన సాయుధ భద్రతా బలగాలు క్షుణ్ణంగా
తనికీలు చేస్తున్నాయి. మే 4న పూంచ్ లో వైమానిక దళ కాన్వాయ్ పై దుండగులు కాల్పులకు
పాల్పడంతో ఓ అధికారి ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గాయపడ్డారు.