కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనానికి సంబంధించి స్పాట్ బుకింగ్ రద్దు చేసింది.
మండల, మకరవిళక్కు సీజన్ నుంచి దేవస్థానం అధికారిక వెబ్సైట్లో వర్చువల్ క్యూ ద్వారా బుకింగ్ చేసుకున్న వారినే దర్శనానికి అనుమతిస్తామని దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. రోజుకు 80 వేల మంది మాత్రమే మణికంఠుడిని దర్శించుకునేలా ఆన్లైన్ బుకింగ్‌పై పరిమితి విధించనున్నారు. మూడు నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చు అని తెలిపారు.
కేదారుడి దర్శనానికి అనుమతి ఎప్పటి నుంచి అంటే . …
ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ధామ్‌లో కేదరనాథుడి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ నెల 10 నుంచి స్వామిని దర్శించుకోవచ్చు.
ఉఖిమఠ్‌లోని భైరవనాథునికి ప్రత్యేక పూజలు చేశారు.
పంచముఖి భోగమూర్తి పల్లకి యాత్ర ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 9న కేదార్నాథ్ ధామ్‌కు చేరుకుంది.