మూడో విడత సార్వత్రిక సమరం మొదలైంది. దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజక వర్గాలకు పోలింగ్ మొదలైంది. మూడో దశలో 1300 మంది బరిలో నిలిచారు. వీరిలో 8 శాతం మంది మహిళలు కావడం విశేషం.
మూడో దశలో 17.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 8.39 కోట్ల మంది మహిళలున్నారు. గుజరాత్ 25, మహారాష్ట్ర 11, ఉత్తరప్రదేశ్ 10,మధ్యప్రదేశ్ 9, ఛత్తీస్‌గఢ్ 7, బిహార్ 5, పశ్చిమ బెంగాల్ 4, అస్సాం 4, గోవా 2, దాద్రా నగర్ హవేలి, డయ్యూ డామన్‌లో 2 ఎంపీ స్థానాలకు 1.85 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్‌లో ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింథియా, మన్సుఖ్ మాండవీయ, ప్రహ్లాద్ జోషి, పురుషోత్తమ్ రూపాలా మూడో దశ ఎన్నికల్లో బరిలో నిలిచారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు