కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. దేవనకొండ, హూళగుండ, హళహర్వి, ఆలూరు, ఆస్పిరి,చిప్పగిరి మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ మొత్తం 235064 మంది ఓటర్లు ఉన్నారు.
ఆలూరులో 1955లో కాంగ్రెస్ నుంచి హెచ్. రామలింగారెడ్డి, 1962లో కాంగ్రెస్ అభ్యర్థి డి.లక్ష్మీకాంతరెడ్డి, 1967లో స్వతంత్ర పార్టీ నుంచి డి.గోవిందదాస్, 1972లో కాంగ్రెస్ నుంచి పి.రాజరత్నం రావు, 1978లో కాంగ్రెస్ నుంచి ఈరన్న, 1983లో టీడీపీ నుంచి కె.బసప్ప, 1985లో కాంగ్రెస్ అభ్యర్థి ఈరన్న విజయం సాధించారు.
1987లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎం.రంగయ్య, 1989లో కాంగ్రెస్ నుంచి గుడ్లనగరి లోక్నాథ్, 1994లో టీడీపీ నుంచి మసాల వీరన్న, 1999, 2004 కాంగ్రెస్ నుంచి మూలింటి మారెప్ప, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ నీరజారెడ్డి, 2014, 2019లో వైసీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం విజయం సాధించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి బూసినె విరూపాక్షి, టీడీపీ నుంచి బి.వీరభద్రగౌడ్, కాంగ్రెస్ నుంచి నవీన్ కిషోర్ అరకట్ల బరిలో నిలిచారు.