కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. ఆదోని మొత్తం ఒకే మండలంగా ఉంది. మొత్తం 204109 మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తుల్లో భాగంగా ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేతో తలపడుతున్నారు.
1952లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి హెచ్.రామలింగారెడ్డి, 1955లో ప్రజా సోషలిస్టు పార్టీ నుంచి జి.బుసన్న, 1962లో స్వతంత్ర అభ్యర్థి హెచ్.సీతారామిరెడ్డి. 1967లో కాంగ్రెస్ నుంచి టీజీఎల్ తిమ్మయ్య గెలుపొందారు. 1972, 1978లో కాంగ్రెస్ నుంచి హెచ్.సత్యనారాయణ విజయం సాధించారు. 1985, 1989లో కాంగ్రెస్ అభ్యర్థి రాయచోటి రామయ్య గెలుపొందారు. 1994, 1999లో టీడీపీ అభ్యర్థి కొంక మీనాక్షి నాయుడు విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ నుంచి వై.సాయి ప్రసాద్ రెడ్డి, 2009లో టీడీపీ నుంచి కొంక మీనాక్షినాయుడు, 2014, 2019లో వైసీపీ అభ్యర్థి వై.సాయిప్రసాద్ రెడ్డి గెలుపొందారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆదోనిలో వైసీపీ అభ్యర్థి వై.గౌరిసాయిప్రసాద్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి డాక్టర్ పీవీ పార్థసారథి, కాంగ్రెస్ అభ్యర్థి గొళ్ల రమేష్ పోటీలో నిలిచారు.