కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెదకొడుబూరు, మంత్రాలయం, కోసిగి, కైతాళం మండలాలు ఈ నియోజకవర్గంలో చేర్చారు. ఇక్కడ 187011 మంది ఓటర్లు ఉన్నారు.
2009, 2014లో టీడీపీ అభ్యర్ధి వై. బాలనాగిరెడ్డి విజయం సాధించారు. తరవాత 2019లో వైసీపీలో చేరి, ఆ పార్టీ నుంచి మూడోసారి గెలిచి హ్యట్రిక్ సాధించారు.2009లో కాంగ్రెస్ అభ్యర్థి డి.రామయ్యపై టీడీపీ అభ్యర్థి 10697 ఓట్ల మెజారిటీ సాధించారు. 2014లో టీడీపీ అభ్యర్థి పి.తిక్కారెడ్డిపై, టీడీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి 7462 ఓట్ల ఆధిక్యం సాధించారు. 2019లో వైసీపీ నుంచి పోటీలో దిగిన బాలనాగిరెడ్డి, సమీప టీడీపీ అభ్యర్థిపై 23879 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికల్లో వైసీపీ నుంచి వై.బాలనాగిరెడ్డి, టీడీపీ నుంచి నల్లగౌని రాఘవేంద్రరెడ్డి బరిలో నిలిచారు. పార్టీ ఏదైనా విజయం మాత్రం బాలనాగిరెడ్డి వైపేననే ప్రచారం సాగుతోంది.