కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది.నందవరం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం 227253 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధాన పార్టీలు రెండూ బలంగా తలపడుతున్నాయి. ఐదేళ్లుగా అధికారంలో ఉండి మంచినీటి సమస్య పరిష్కరించలేకపోవడం వైసీపీకి మైనస్.
1955లో కాంగ్రెస్ నుంచి డి.సంజీవయ్య, 1962లో స్వతంత్ర పార్టీ నుంచి వైసీ వీరభద్ర గౌడ్, 1967, 1972లో కాంగ్రెస్ నుంచి పీవో సత్యనారాయణ రాజు, 1978లో కాంగ్రెస్ నుంచి హనుమంతరెడ్డి విజయం సాధించారు. 1983లో కాంగ్రెస్ నుంచి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, 1985, 1989, 1994, 1999లో టీడీపీ అభ్యర్థి బీవీ మోహన్ రెడ్డి గెలుపొందారు.2004, 2009, 2012లో కాంగ్రెస్ అభ్యర్థి కె.చెన్నకేశవరెడ్డి గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి బీవీ జయనాగేశ్వరరెడ్డి, 2019లో వైసీపీ అభ్యర్థి కె.చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు.
2024 మే 13న జరగనున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా బుట్టా రేణుక, టీడీపీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి పోటీలో నిలిచారు. బుట్టా రేణుక నాన్ లోకల్ కావడం టీడీపీ అభ్యర్థికి కలసివచ్చే అంశం.