కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం 1962లో ఏర్పడింది. 1962లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కర్నూలు, సి.బెళగళ్, కొడుమూరు, గూడూర్ మండలాలతో కొడుమూరు రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో 216090 మంది ఓటర్లు ఉన్నారు.
రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పాటయ్యాక 1962లో కాంగ్రెస్ అభ్యర్థి డి. సంజీవయ్య, 1967లో స్వతంత్ర పార్టీ నుంచి పి.ఆర్.రావు, 1972, 1978, 1983లో కాంగ్రెస్ అభ్యర్థి డి.మునిస్వామి గెలుపొందారు. 1985లో టీడీపీ నుంచి ఎం.శిఖామణి, 1989లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.మధన్ గోపాల్, 1994, 1999లో కాంగ్రెస్ నుంచి ఎం.శిఖామణి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి మురళీ కృష్ణ, 2014లో వైసీపీ అభ్యర్థి ఎం.మణిగాంధీ, 2019లో వైసీపీ నుంచి జె.సుధాకర్ గెలుపొందారు.
2024 మే 13న జరగనున్న పోరులో వైసీపీ నుంచి డాక్టర్ ఆదిమూలపు సతీష్, టీడీపీ నుంచి బొగ్గుల దస్తగిరి, కాంగ్రెస్ నుంచి పెరిగెల మురళీ కృష్ణ గెలుపొందారు. గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం అక్కడ వైసీపీ బలంగా ఉంది. టీడీపీ పోరాటం చేయడమేగాని ఇక్కడ గెలిచే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి.