Pawan Kalyan rejects to let Mudragada’s daughter join JSP
కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇంట్లో తాను గొడవలు
పెట్టాలని అనుకోవడం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ముద్రగడ
పద్మనాభాన్ని, ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతానని ఆయన చెప్పారు.
తునిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ ముద్రగడ కుటుంబం వివరాలు తనకు తెలియవన్నారు.
ఆదివారం తుని బహిరంగ సభ వేదిక వద్ద ముద్రగడ
కుమార్తెక్రాంతి, ఆమె భర్త పవన్‌కళ్యాణ్‌తో సమావేశమై, జనసేన
పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. కానీ దానికి పవన్ కళ్యాణ్ అంగీకరించలేదు. తనకు
ముద్రగడ పద్మనాభంతో వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలూ లేవనీ, ఆయన కుటుంబాన్ని
విడదీయలేననీ చెప్పారు. క్రాంతి తన తండ్రి అనుమతి పొంది వస్తే, తప్పకుండా పార్టీలో
చేర్చుకుంటానని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా తనకు ఒక సోదరుడిగా అండగా
ఉంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెను జనసేన నుంచి పోటీ చేయిస్తానని హామీ ఇచ్చారు.
తునిలో జనసేన వారాహి విజయభేరి సభలో ప్రసంగించిన
పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాద వైసీపీ
ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపిచ్చారు.
అంతకుముందు పొన్నూరు బహిరంగ
సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, తన రాకను అడ్డుకోడానికి హెలిప్యాడ్ తవ్వేసారని
ఆరోపించారు. అలాంటి ఉగ్రవాద చర్యకు పాల్పడిన వైఎస్సార్సీపీ నేతలపై ఉగ్రవాద కేసులు
పెడతామని హెచ్చరించారు.