ఉదయగిరిలో
గెలవడానికి ఎంత శ్రమపడాలో, అధికారం చేపట్టిన తర్వాత తిష్ట వేసిన సమస్యలు పరిష్కారానికి
అదే స్థాయిలో చెమటోడ్చాల్సిన పరిస్థితి. కరువు, నిరుద్యోగ సమస్యలు నియోజకవర్గ అభివృద్ధికి
అవరోధాలుగా మారాయి. 8 మండలాలు ఉన్న ఈ నియోజకవర్గంలో సాగునీటి సమస్య అధికంగా ఉండగా,
ఎక్కువగా మెట్ట వ్యవసాయ భూమి ఉంది.
ఉదయగిరి,
సీతారామపురం, వరికుంటపాడు, వింజమూరు నుంచి 25 శాతం మంది ప్రజలు జీవనోపాధి కోసం
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వలసపోయారు. సోమశిల హైలెవల్ కెనల్ పనులు పూర్తి
అయితేనే వీరికి సాగునీళ్లు వస్తాయి.
2024
ఎన్నికల సమరంలో ఉదయగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి, టీడీపీ నుంచి కాకర్లు
సురేశ్ పోటీలో ఉన్నారు. ఇద్దరూ తొలిసారి
ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్న వారే.
రాజకీయ ఉద్దండులుగా పేరుగాంచిన మాజీ
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇక్కడి నుంచే తొలిసారి పోటీ చేశారు. 1978లో జనతా పార్టీ నుంచి వెంకయ్య
నాయుడు పోటీ చేశారు. ఆ తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా 1985లో కాంగ్రెస్
పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
1952
తర్వాత నుంచి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ఏడు సార్లు
జెండా ఎగురవేసింది.
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 2004, 2009లో ఈ స్థానాన్ని కైవసం
చేసుకున్నారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఆయనను వైసీపీ
సస్పెండ్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ ఆయనను
దూరం పెట్టిన వైసీపీ, మేకపాటి రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయించింది.
టీడీపీలో
చేరిన చంద్రశేఖర్ రెడ్డి, ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కాకర్ల సురేశ్ కు మద్దతు
తెలిపారు. 1999, 2024లో విజయరామిరెడ్డి, బొల్లినేని వెంకటరామయ్య లు ఈ స్థానం నుంచి
పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వీరిద్దరూ టీడీపీ తరఫున పోటీ చేశారు.
మేకపాటి
రాజమోహన్ రెడ్డి తన సోదరుడి విజయం కోసం అనుచరులతో పలుమార్లు సమావేశం అయ్యారు.
రాజగోపాల్ రెడ్డి ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నప్పటికీ ఆత్మకూరు, ఉదయగిరి
ఎన్నికల్లో కుటుంబ సభ్యుల విజయం కోసం పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. నవరత్నాల
ప్రభావంతో పాటు కుటుంబ సంబంధాలు ఆయనకు కలిసి వచ్చే అంశం.
టీడీపీ
అభ్యర్థి కాకర్ల సురేశ్ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు
చేపట్టారు. వైద్య శిబిరాలు నిర్వహించారు. తనను గెలిపిస్తే స్థానిక యువతకు ఉపాధి
కల్పిస్తానని హామీ ఇస్తున్నారు.