నెల్లూరు
లోక్‌సభ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరఫున పోటీలో ఉండగా ఆయన
భార్య ప్రశాంతి రెడ్డి ఈ పార్లమెంటు పరిధిలోని కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి
సైకిల్ గుర్తుపై బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి భార్యాభర్తలు లోక్‌సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేస్తున్నారు.
2009
ఎన్నికల్లో తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నుంచి కొత్తకోట దయాకర్‌రెడ్డి, దేవరకద్ర నుంచి ఆయన భార్య సీతా దయాకర్‌రెడ్డి
సైకిల్ గుర్తుపై పోటీ చేసి గెలిచారు.
ప్రస్తుతం కోవూరులో వేమిరెడ్డి, నల్లపురెడ్డి
కుటుంబాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు నడుస్తోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పోటీలో నిలిచారు. కోవూరు అభ్యర్థిగా ప్రశాంతిరెడ్డి
పేరును టీడీపీ ప్రకటించిన అప్పటి నుంచి అక్కడ యుద్ధవాతావరణం నెలకొందని చెప్పవచ్చు.
వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ప్రసన్నకుమార్
రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, ఆయన తండ్రి శ్రీనివాసులరెడ్డి మూడుస్లారు శాసనసభకు
ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన ప్రసన్నకుమార్ రెడ్డి,
2012లో వైసీపీలో చేరారు.
2019లో టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసుల
రెడ్డిపై గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గెలిచారు. 2014లో మాత్రం
ప్రసన్నకుమార్ రెడ్డిపై శ్రీనివాసుల రెడ్డి నెగ్గారు. 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ
అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై వైసీపీ నుంచి పోటీ చేసిన ప్రసన్నకుమార్
రెడ్డి 39 వేల మెజారిటీ సాధించారు.
నియోజకవర్గంలో
ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కీలకం.విడవలూరు,
కొడవలూరు,
కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.