ఖలిస్థాన్ ఉగ్రవాది హర్ధీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసిన తరవాత మొదటిసారిగా కెనడా ప్రధాని ట్రూడో స్పందించారు. కెనడాలో చట్టబద్దమైన పాలన, న్యాయవ్యవస్థ ఉందన్నారు. తమ దేశ పౌరులను రక్షించుకోవడం ప్రభుత్వ బాధ్యతని గుర్తుచేశారు. నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోందన్నారు.
కెనడాలో నివశించే ప్రతిపౌరుడికి జీవించే హక్కు ఉంది, వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ప్రధాని ట్రూడో వ్యాఖ్యానించారు.నిజ్జర్ హత్య తరవాత కొందరు అభద్రతా భావంతో జీవిస్తున్నారని చెప్పారు. గత ఏడాది జరిగిన నిజ్జర్ హత్యలో భారత్ గూఢచర్యసంస్థ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తాజాగా నిజ్జర్ హత్య కేసులో ముగ్గురుని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.