ఒంగోలు లోక్‌సభ పరిధిలోని యర్రగొండపాలెం నియోజకవర్గం 1955లో ఏర్పడింది. 2008లో రిజర్వుడ్ అసెంబ్లీ స్థానంగా మార్చారు. యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, డోర్నాల, పెద్దారవీడు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. 200379 మంది ఓటర్లున్నారు. తీవ్ర కరవు ప్రాంతమైనా, రాజకీయంగా మంచి చైతన్యం కలిగిన నియోజకవర్గం యర్రగొండపాలెం.
1955లో యర్రగొండపాలెం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నక్కా వెంకటయ్య, 1960లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జె.రామిరెడ్డి విజయం సాధించారు. 1962, 1967లో సీపీఐ అభ్యర్థి పూల సుబ్బయ్య గెలుపొందారు. 1972లో కాంగ్రెస్ నుంచి కందుల ఒబుల్ రెడ్డి,2009లో కాంగ్రెస్ అభ్యర్థి ఆదిమూలపు సురేష్,2014లో వైసీపీ నుంచి పాలపర్తి డేవిడ్ రాజు, 2019లో వైసీపీ నుంచి ఆదిమూలపు సురేష్ గెలుపొందారు.
ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ నుంచి తాటిపర్తి చంద్రశేఖర్, టీడీపీ నుంచి గూడూరి ఎరిక్సన్, కాంగ్రెస్ నుంచి బుధాల అజితారావు బరిలో నిలిచారు. వైసీపీకి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో యర్రగొండపాలెం కూడా ఒకటి కావడంతో ఆ పార్టీ విజయావకాశాలు మెండుగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే మంత్రి ఆదిమూలపు సురేష్‌పై వైసీపీలో అసమ్మతి పెరగడంతో ఆయన్ను అక్కడ నుంచి బదిలీ చేయడం ఆ పార్టీకి కొంత మైనస్ అని చెప్పవచ్చు.