గిద్దలూరు నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది.బెస్తవారిపేట, రాచర్ల, గిద్దలూరు, కొమరోలు, కంభం, అర్థవీడు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ 232920 మంది ఓటర్లున్నారు. వ్యవసాయం ప్రధానంగా సాగే ఈ నియోజకవర్గంలో 2019లో వైసీపీ అభ్యర్థి రికార్డు మెజారిటీ సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి అది కలసి వచ్చే అంశం కాగా, వైసీపీ అభ్యర్థిని మార్చడం టీడీపీకి లాభించేలా ఉంది.
గిద్దలూరు నియోజకవర్గంలో 1955లో మొదటిసారి ఎన్నికలు నిర్వహించారు. 1952లో కాంగ్రెస్ అభ్యర్థి పిడతల రంగారెడ్డి, 1962లో స్వతంత్ర అభ్యర్థి ఈదుల బలరామిరెడ్డి, 1967, 1972లో కాంగ్రెస్ నుంచి, 1978లో జనతా పార్టీ నుంచి పిడతల రంగారెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. 1983లో స్వతంత్ర అభ్యర్థి ముడియం పీరారెడ్డి, 1985లో టీడీపీ నుంచి పిడతల రంగారెడ్డి గెలుపు తీరాలు చేరుకున్నారు.
1989లో కాంగ్రెస్ అభ్యర్థి ఏలూరి వెంకటరెడ్డి, 1994లో, 1999లో టీడీపీ నుంచి పిడతల విజయ్ కుమార్ రెడ్డి గెలిచారు. 2004లో కాంగ్రెస్ నుంచి పగడాల రామయ్య, 2009లో ప్రజారాజ్యం నుంచి అన్నా రాంబాబు విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి ముతుముల అశోక్ రెడ్డి, 2019లో వైసీపీ నుంచి అన్నా రాంబాబు రికార్డు స్థాయిలో 80 వేలకుపైగా మెజారిటీతో గెలిచారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు అసెంబ్లీకి వైసీపీ నుంచి కందుల నాగార్జున రెడ్డి, టీడీపీ నుంచి ముత్తుముళ్ల అశోక్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పగడాల పెద్ద రంగస్వామి బరిలో నిలిచారు.2019లో అత్యధిక మెజారిటీతో గెలిచిన వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబును మార్చడం ఆ పార్టీకి మైనస్ కాగా…టీడీపీకి బలమైన రెడ్డి సామాజికవర్గం
అండగా నిలవడం కలిసివచ్చే అంశం.