ఏపీలో రెండో అతిపెద్ద తీవ్ర కరవు ప్రాంతం అయినా.. సంపన్న రాజకీయ నాయకులుండే జిల్లా ప్రకాశం. జిల్లాలో ఒంగోలు పార్లమెంటు స్థానం 1952లో ఏర్పాటైంది. ఇక్కడ 1342368 మంది ఓటర్లున్నారు. యర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. కనిగిరి, యర్రగొండపాలెం అసెంబ్లీ స్థానాలు రిజర్వుడు కేటగిరీలో ఉన్నాయి.
1952లో స్వతంత్ర అభ్యర్థి పి. వెంకటరాఘవయ్య, 1957లో కాంగ్రెస్ అభ్యర్థి రొండా నరపారెడ్డి, 1962లో సీపీఐ అభ్యర్థి మాదాల నారాయణస్వామి, 1967లో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గయ్య, 1971, 1977, 1980ల్లో మూడు సార్లు వరుసగా కాంగ్రెస్ అభ్యర్థి పులి వెంకటరెడ్డి విజయం సాధించారు. 1984లో టీడీపీ అభ్యర్థి బెజవాడ పాపిరెడ్డి, 1989లో కాంగ్రెస్ నుంచి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, 1996లో కాంగ్రెస్ అభ్యర్థి మాగుంట పార్వతమ్మ 1998లో అదే పార్టీ నుంచి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గెలుపొందారు.
1999లో టీడీపీ అభ్యర్థి కరణం బలరాం విజయం సాధించారు. 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, 2014లో కాంగ్రెస్ నుంచి వైవీ సుబ్బారెడ్డి, 2019లో వైసీపీ నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి విజయం సాధించారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తలపడుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నుంచి ఒంగోలు బదిలీపై వచ్చిన చెవిరెడ్డి గెలుస్తారా…తరచూ జెండాలు మార్చే స్థానిక నాయకుడు మాగుంట విజయం సాధిస్తారా అనేది ఓటర్లే నిర్ణయించాలి.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు