సంతనూతలపాడులో మరోసారి సత్తా చాటేందుకు వైసీపీ
ప్రయత్నిస్తుండగా, ఎలాగైనా ఈసారి నియోజకవర్గాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని టీడీపీ
శ్రమిస్తోంది. నాలుగు
దఫాలుగా ఇక్కడ టీడీపీ జెండా ఎగరని పరిస్థితి. దీంతో ఈ సారి ఎలాగైనా పసుపు జెండాను
రెపరెపలాడించాలని ఆ పార్టీ అభిమానులు శ్రమిస్తున్నారు.
ఈ నియోజకవర్గంలో వైసీపీ మంత్రి మేరుగ నాగార్జున, టీడీపీ నుంచి బొమ్మాజి నిరంజన్ విజయ్ కుమార్,
కాంగ్రెస్ నుంచి విజేష్ రాజ్ పాలపర్తి పోటీలో ఉన్నారు.
1999లో
పాలపర్తి డేవిడ్ రాజు గెలిచిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ టీడీపీ అభ్యర్థి విజయం
సాధించలేదు.
2004లో హస్తం గుర్తుపై పోటీ చేసిన దార సాంబయ్య గెలవగా, 2009లో బీఎన్ విజయ్
కుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి ఆదిమూలపు సురేశ్,
2019 టీజేఆర్ సుధాకర్ బాబు నెగ్గారు.
రెండు దఫాలుగా టీడీపీ రెండోస్థానంతోనే
సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
వైసీపీ అభ్యర్థి గత ఎన్నికల్లో వేమూరు నుంచి పోటీ చేసి
టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి నక్కా ఆనందబాబుపై విజయం సాధించారు. అయితే ఈ సారి ఆయనను
సంతనూతలపాడుకు వైసీపీ అధిష్టానం బదిలీ చేసింది.
ప్రొఫెసర్ నుంచి పొలిటిషియన్ గా మారిన మేరుగ నాగార్జున
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. 2009, 2014లో వైసీపీ నుంచి వేమూరులో పోటీ చేసి
ఓడారు. 2019లో గెలవడంతో రెండో విడత కేబినెట్ విస్తరణలో మంత్రిగా అవకాశం దక్కింది.
టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన విజయ కుమార్ కూడా ఉన్నత
విద్యావంతులు, మెకానికల్ ఇంజినీరింగ్ లో పట్టభద్రుడైన విజయ కుమార్ 2009లో హస్తం గుర్తుపై పోటీ చేసి ఎమ్మెల్యేగా
గెలిచారు. 2014, 2019లో సైకిల్ గుర్తుపై పోటీ చేసి ఓడినప్పటికీ మరోసారి ఆయనకే టీడీపీ
అవకాశమిచ్చింది.
సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పై ప్రజావ్యతిరేకత
ఎక్కువగా ఉండటంతో ఆయనకు బదులు మేరుగ నాగార్జునను వైసీపీలో బరిలో దింపింది.