పర్చూరు
అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ పోరు రసవత్తరంగా మారింది. టీడీపీ నుంచి
మూడో దఫా ఏలూరి సాంబశివరావు పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి ఎడం బాలాజీ తొలి సారి
బ్యాలెట్ ఫైట్ కు దిగారు.
2019 ఎన్నికల్లో పర్చూరు
నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి, స్వల్ప ఓట్ల తేడాతో ఏలూరి సాంబశివరావు
చేతిలో ఓడారు. 2014లో ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసిన గొట్టిపాటి భరత్ పైనా పది వేల
ఓట్ల మెజార్టీ సాధించిన ఏలూరి సాంబశివరావు, మరోసారి పర్చూరి బరిలో నిలిచారు. వైసీపీ నుంచి ఎన్ఆర్ఐ ఎడం బాలాజీ తొలిసారి రాజకీయాల్లో
అడుగుపెట్టారు. కాంగ్రెస్ నుంచి నల్లగొర్ల
శివసాయి లక్ష్మీజ్యోతి కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
ఏలూరి
హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆయన వర్గం చెబుతోంది. కూటమి బలానికి తోడు అభ్యర్థికి
ఉన్న ఓటు బ్యాంకుతో గెలుపు పక్కా అని జోస్యం చెబుతున్నారు. నవరత్నాలు అమలుకు తోడు
కాపు సామాజికవర్గం అండతో వైసీపీ విజయం సునాయాసమనే లెక్కలు కూడా నియోజకవర్గంలో
వినిపిస్తున్నాయి.
ఈ
నియోజకవర్గంలో యద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, చిన్నగంజాం, మార్టురు
మండలాలు ఉన్నాయి.
కమ్మ, కాపు ఓట్లు దాదాపు సమాన స్థాయిలో
ఉన్నాయి.
2009
ఎన్నికల్లో హస్తం గుర్తుపై పోటీ చేసిన
దగ్గుబాటి వెంకటేశ్వరరావు, టీడీపీ అభ్యర్థి పై సుమారు 3 వేల ఓట్ల మెజారిటీతో విజయం
సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి గొట్టపాటి నరసింహారావు పోటీ చేశారు. పీఆర్పీ
నుంచి పోటీ చేసిన సండు పూర్ణచంద్రరావు 19 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
2004లోనూ కాంగ్రెస్ అభ్యర్థి గా దగ్గుబాటి వెంకటేశ్వరరావు విజయం సాధించారు.
1999లో
మాత్రం హస్తం గుర్తుపై పోటీ చేసిన గాదె వెంకటరెడ్డిపై టీడీపీ అభ్యర్థి జాగర్లమూడి
లక్ష్మీ పద్మావతి విజయం సాధించారు. 1991 ఉప ఎన్నిక, 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి
గా పోటీ చేసిన గాదె వెంకటరెడ్డి గెలిచారు.