ఖలిస్థాన్ వేర్పాటువాద ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన ముగ్గురు నిందితులకు పాక్ ఐఎస్ఐ ఏజంట్లతో సంబంధాలున్నాయని జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఆంగ్ల మీడియా సంస్థ కథనం ప్రచురించింది. కెనడాలోని ఎడ్మంటన్‌లో నివాసముండే కరణ్‌ప్రీత్ సింగ్, కమల్‌ప్రీత్‌సింగ్, కరణ్ బ్రార్‌లను కెనడా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కొందరు ఉగ్రవాదులు కెనాడాలో నివాసం ఉంటూ భారత్‌లో నేరాలకు పాల్పడుతున్నారు.ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థకు పాక్ ఐఎస్ఐ నుంచి నిధులు అందుతున్నాయని జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. కెనడాకు ఆధారాలు సమర్పించినా చర్యలు తీసుకోలేదు.ముగ్గురుని అరెస్ట్ చేసి భారత గూఢచర్యసంస్థలతో వారికి సంబంధాలున్నాయంటూ కెనడా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తోంది. అరెస్టైన వారు డగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. వారికి ఐఎస్ఐతో కూడా సంబంధాలున్నాయని ఆంగ్ల మీడియా ప్రచురించింది.
నిజ్జర్ హత్యలో ప్రమేయం ఉదంటూ శుక్రవారం అరెస్టైన ముగ్గురిపై ఫస్ట్ డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. మరింత మంది ప్రమేయం కోణంలో దర్యాప్తు సాగుతోందని కెనడా పోలీసులు వెల్లడించారు. నిజ్జర్ హత్యలో నిందితులందరినీ గుర్తించి అరెస్ట్ చేస్తామని కెనడా పోలీసులు ప్రకటించారు.