Delhi Congress President Arvinder
Singh Lovely joins BJP
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష
పదవికి ఇటీవలే రాజీనామా చేసిన అర్విందర్ సింగ్ లవ్లీ, ఇవాళ బీజేపీలో చేరారు. ఇండీ
కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చుకోడాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న లవ్లీ ఆ
కారణంతోనే కాంగ్రెస్ నుంచి వైదొలిగారు.
అర్విందర్ ఏప్రిల్ 28న
కాంగ్రెస్‌కు రాజీనామా చేసారు. ఇవాళ ఆయన మరో నలుగురు కాంగ్రెస్ నాయకులతో పాటు కేంద్రమంత్రి
హర్దీప్సింగ్ పూరీ సమక్షంలో కాషాయదళంలో చేరారు. ఇటీవలే కాంగ్రెస్‌ను వీడిన
ఎమ్మెల్యేలు రాజ్‌కుమార్ చౌహాన్, నీరజ్ బసోయా, నసీబ్ సింగ్‌లతో పాటు ఢిల్లీ యూత్ కాంగ్రెస్
అధ్యక్షుడు అమిత్ మాలిక్ కూడా అర్విందర్తో పాటు బిజెపిలో చేరారు.
రాజ్‌కుమార్ చౌహాన్
గతంలో ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసారు. ఆయన ఏప్రిల్ 24న కాంగ్రెస్‌కు
రాజీనామా చేసారు. అర్విందర్ 2023 ఆగస్టు నుంచి ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా
వ్యవహరిస్తున్నారు. ఆయన ఏప్రిల్ 28న రాజీనామా చేసారు. వారిద్దరూ ఇవాళ బిజెపిలో
చేరిపోవడం ఢిల్లీలో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బే.
లవ్లీ రాజీనామాకు
ముందురోజు ఢిల్లీ సిఖ్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ కార్యవర్గం సహా వెయ్యిమంది
సిక్ఖు మతస్తులు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు.