గుంటూరు తూర్పు నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. అంతక ముందు గుంటూరు వన్ గా వ్యవహరించేవారు. ఈ నియోజకవర్గంలో 229830 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం గుంటూరు మండలంలోకి వస్తుంది.ఇది పూర్తిగా పట్టణ నియోజకవర్గం. ఇక్కడ ముస్లిం సామాజికవర్గం అధిక సంఖ్యలో ఉంది. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ముస్లిం సామాజికవర్గానికి చెందినే వారే ఉండటం కూడా నాలుగు దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది.
గుంటూరు వన్ నుంచి 1952లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ అభ్యర్థి నడింపల్లి వెంకట లక్ష్మీ నరసింహరావు గెలుపొందారు. 1955లో కాంగ్రెస్ అభ్యర్థి తెల్లాకుల జాలయ్య, 1962లో కాంగ్రెస్ అభ్యర్థి కనపర్తి నాగయ్య, 1967, 1972లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎస్. అంకమ్మ, విజయ్ రామానుజం గెలుపొందారు.1978లో కాంగ్రెస్ అభ్యర్థి లింగంశెట్టి ఈశ్వరరావు, 1983లో టీడీపీ అభ్యర్థి ఉమారుఖాన్ పఠాన్,1985, 1989లో కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ జానీ గెలిచారు. మహ్మద్ జానీ మంత్రిగా సేవలందించారు. 1994, 1999లో ఎస్.ఎం. జియాఉద్దీన్ టీడీపీ నుంచి గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి షేక్ సుభాని, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి షేక్ మస్తాన్ వలి, 2014, 2019లో వైసీపీ నుంచి మహ్మద్ ముస్తఫా గెలుపొందారు.
ప్రస్తుతం వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా కూతురు నూరి ఫాతిమా, టీడీపీ నుంచి మహ్మద్ నజీర్, కాంగ్రెస్ అభ్యర్థి షేక్ మస్తాన్ వలి బరిలో నిలిచారు. అన్ని పార్టీల నుంచి బరిలో దిగిన అభ్యర్థులంతా ముస్లింలు కావడం, అక్కడ ఓటర్లలో ఎక్కువ భాగం ఆ సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో వారి ఆశీస్సుల కోసం అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు