గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గుంటూరు వెస్ట్ ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో 265135 మంది ఓటర్లున్నారు. ఇది పూర్తిగా పట్టణ నియోజకబర్గం. గుంటూరు పశ్చిమమొత్తం గుంటూరు మండలంగా ఉంది.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఏర్పాటు కాకముందు గుంటూరు 2 గా ఉండేది.. గుంటూరు పశ్చిమ ఏర్పాటు కాకముందు 1955లో కాంగ్రెస్ అభ్యర్థి మేడూరి నాగేశ్వరరావు, 1962, 1967లో కాంగ్రెస్ అభ్యర్థి చేబ్రోలు హనుమయ్య, 1972లో స్వతంత్ర అభ్యర్థి నిశంకరరావు వెంకటరత్నం, 1978లో కాంగ్రెస్ అభ్యర్థి గాదె వీరాంజనేయ శర్మ,1983లో టీడీపీ అభ్యర్థి నిశంకరరావు వెంకటరత్నం, 1985, 1989లో కాంగ్రెస్ అభ్యర్థి చదలవలవాడ జయరాంబాబు, 1994లో టీడీపీ అభ్యర్థి చల్లా వెంటక కృష్ణారెడ్డి, 1999లో టీడీపీ నుంచి శనక్కాయల అరుణ, 2004లో కాంగ్రెస్ అభ్యర్థి తాడిశెట్టి వెంకట్రావు విజయం సాధించారు.
గుంటూరు పశ్చిమ ఏర్పాటైన తరవాత 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, 2014లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, 2019లో మద్దాల గిరిధర్‌రావు గెలుపొందారు. టీడీపీ నుంచి గెలిచిన మద్దాల గిరి, తరవాత వైసీపీ చేరారు.
ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికల్లో టీడీపీ నుంచి గల్లా మాధవి, వైసీపీ నుంచి మంత్రి విడదల రజని పోటీపడుతున్నారు. మాధవి వికాస్ హాస్పటల్స్ డైరెక్టర్‌గా నగరవాసులకు పరిచయమే. విడదల రజని చిలకలూరిపేట నుంచి బదిలీపై వచ్చి, గుంటూరు పశ్చిమ నుంచి బరిలో దిగారు. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడం, ఆ సామాజికవర్గం అక్కడ పెద్దగా లేకపోవడం విశేషం.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు